బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (10:10 IST)

దక్షిణాది చిత్రపరిశ్రమలో పురుషాధిక్యత అధికం..: తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannah Bhatia
దక్షిణాది చిత్రపరిశ్రమపై మిల్కీబ్యూటీ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ మూవీ ఇండస్ట్రీలో పురుషాధిక్యత అధికమని, అందుకే తానుక చాలా చిత్రాలను వదులుకున్నట్టు చెప్పారు. దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదన్నారు. 
 
ఉత్తరాదికి చెందిన ఈ భామ.. దక్షిణాది చిత్రసీమలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. కోట్లాది రూపాయాలను సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఇక్కడి చిత్రపరిశ్రమపై చిన్నచూపు చూస్తుంటారు. సౌత్ మూవీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతారు. ఎపుడు అవకాశం వస్తే అపుడు బాలీవుడ్‌కు చెక్కేద్దామా అనే ఆలోచనలోనే ఉంటారు. పైగా, బాలీవుడ్ ఆఫర్లు రాగానే సౌత్ సినీ పరిశ్రమపై తన నోటి దూలను ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో తమన్నా కూడా చేరిపోయారు. 
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ కావాలనే ఆశతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తాను ఎంతో శ్రమిస్తున్నానని తెలిపారు. కొన్ని సినిమాలను కావాలనే వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనికి కారణం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతే అని చెప్పారు. సౌత్ సినిమాలు పురుషాధిక్యాన్ని సెలబ్రెట్ చేసుకునే విధంగా ఉంటాయని, సినిమా మొత్త హీరోయిజమే ఉంటుందని, హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని చెప్పారు. అందుకే ఇలాంటి చిత్రాల్లో భాగం కారాదన్న ఆలోచనతో చాలా చిత్రాల ఆఫర్లను వదులుకున్నట్టు చెప్పారు.