శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (11:43 IST)

చిన్న తప్పు వల్ల పవన్ సీఎం కాలేకపోతున్నారు.. శివాజీ

sivaji
టాలీవుడ్ హీరో శివాజీ తాజాగా బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ఏడోసీజన్‌లో కంటిస్టెంట్‌గా వెళ్లి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లకముందు శివాజీ జనసేనాని పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
చిన్న తప్పు వల్ల పవన్ సీఎం కాలేకపోతున్నారని చెప్పాడు. ఆ లోపం ఏంటో తనకు తెలుసు. లోపాన్ని సరిదిద్దుకుంటే సీఎం కావడం సులువు. 2029లో ఇది సాధ్యమవుతుందని.. అయినా ఇది తన దృష్టిలో చాలా చిన్న విషయం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
రెండెకరాల రైతు కొడుకు అయిన తాను భారీ సంఖ్యలో సినిమాల్లో నటించడం అంటే గ్రేటే కదాని, తాను ఎప్పుడూ రాజకీయాల్లో లేను.. బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చానని, తాను ప్రజల గొంతుక ప్రజల తరపున ఎవరు తప్పు చేసినా అడుగుతానని తెలిపాడు. ప్రస్తుతం తాను 50  లక్షల రూపాయల కారులో తిరుగుతున్నానని శివాజీ తెలిపారు.