సంబంధిత వార్తలు
- సీమాన్‌ను అరెస్ట్ చేస్తారా లేదా? ఆరు గంటలు విజయలక్ష్మి అక్కడే?
- అల్లు రామలింగయ్యకు పూజ్యస్థానం కల్పించిన మెగాస్టార్ చిరంజీవి
- విదేశీ పర్యటనకు వెళ్లాలనివుంది.. అనుమతి ఇవ్వండి : కోర్టులో జగన్ పిటిషన్
- ఇలాంటి అమ్మాయి నా లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటున్నా: విజయ్ దేవరకొండ
- ఖుషితో వాళ్ల ముఖాల్లో ఆనందం చూడాలనుంది : విజయ్ దేవరకొండ
రాజకీయాల్లోకి వస్తున్న కోలీవుడ్ అగ్ర హీరో.. ఎవరు?
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించారు. తమిళనాడును పాలించిన రాజకీయ నేతల్లో అత్యధిక శాతం కోలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందినవారే. వారిలో దివంగత ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు ప్రధానం. ఇపుడు మరో అగ్రహీరో రాజకీయాల్లోకి రానున్నారు. ఆయన దళపతి విజయ్ అలియాస్ విజయ్ జోసెఫ్. వచ్చే యేడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపే రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం సంఘ సేవ కోసం స్థాపింపిన తన విజయ్ మక్కల్ ఇయక్కమ్ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో పది, ఇంటర్, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లాలవారీగా ఉపకార వేతనాలు అందించారు. సంస్థ నిర్వాహకులతో ఈ మధ్య విజయ్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజలకు సంస్థ కార్యకలాపాలను క్షణాల్లో చేర్చే దిశగా సోషల్ మీడియా, ఐటీ విభాగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించారు. సంస్థలో సాంకేతిక విభాగం సభ్యుల సంఖ్యను 30 వేలకు పెంచాలని కూడా నిర్ణయించారు. అలాగే, విజయ్ మక్కల్ ఇయక్కమ్‌ను ప్రస్తుతం 1600 వాట్సప్ గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటి సంఖ్యను నెల రోజుల్లోనే 10 వేలకు పెంచాలని విజయ్ ఆదేశించారు. అలా కింది స్థాయి నుంచి ఆయన తన రాజకీయ పునాదులను నిర్మించుకుంటూ వస్తున్నారు.
తర్వాతి కథనం
