సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (11:52 IST)

ఖుషితో వాళ్ల ముఖాల్లో ఆనందం చూడాలనుంది : విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda
లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్  ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో  ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుద్దేశించి అన్నారు. 
 
- నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ పలు విషయాలు తెలిపారు. 
 
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసేందుకు నా ఫ్రెండ్స్ తో కలిసి యూసుఫ్ గూడలో ఓ థియేటర్ కు వెళ్లా. అప్పటికి నేను ఎవరికీ తెలియదు. నా సీన్స్ వచ్చేటప్పుడు ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేయడం చూశా. సినిమా పూర్తయ్యాక నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చారు. పెళ్లి చూపులు సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆ థియేటర్ నవ్వులతో ఊగిపోవడం చూశా. ఆ సినిమా రిలీజైన నెక్ట్ డే నా ఫోన్ కంగ్రాట్స్ మెసేజ్ లతో నిండిపోయింది. నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. లైగర్ ఫ్లాప్ అయినప్పుడు నెక్ట్ మూవీ హిట్ కొట్టాలి అన్నా అనేవారు. వాళ్ల ముఖాల్లో ఆనందం కోసం ఖుషితో హిట్ కొడుతున్నాం అన్నారు. 
 
ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మంచి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తారు. అలా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తే సెట్ లో ఇబ్బందే ఉండదు. ఈ సినిమా ఫస్టాఫ్ లో నేను లవర్ బాయ్ లా కనిపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ బాయ్ గా కనిపిస్తా. నేను ఇప్పటిదాకా హజ్బెండ్ క్యారెక్టర్ చేయలేదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి
 
డైరెక్టర్ శివతో కనెక్ట్ అయ్యేందుకు నాకు ఓ నెల రోజుల టైమ్ పట్టింది. ఫస్ట్ ఏదైనా నచ్చుకుంటే బాగా లేదని ఓపెన్ గా చెప్పేవాడిని. అది చూసిన సమంత ..విజయ్ ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది..అలా ఫేస్ మీదే చెప్పకూడదు అని సజెస్ట్ చేసింది. శివ నేను కనెక్ట్ అయిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు.
 
ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.
 
ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను.
 
తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.
 
డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా.
 
ఫ్యాన్స్ నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ గుర్తు లేదు. చాలా మంది నా ఫొటోను ఆర్ట్ గా గీసి పంపిస్తుంటారు. నాకు నా ఫొటోస్ ఆర్ట్ లో చూడటం ఇష్టం ఉండదు. మీరు ఇంకే బొమ్మ గీసి ఇచ్చినా తీసుకుంటా.
 
సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా.
 
నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు.
 
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నా మూవీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను.