సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2023 (13:32 IST)

'ఖుషీ' కోసమేనా VD హ్యాండ్స్ గేమ్, ఆ చేయి ఆమెదేనంటూ సోషల్ మీడియాలో చర్చ

VD
కర్టెసి-ట్విట్టర్
తమ కొత్త సినిమా విడుదల కాబోతుందంటే ఆ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన టెక్నీషియన్లు నానా హైరానా పడుతుంటారు. ఇది ఏ బిజినెస్‌లో అయినా సహజమే. కాకపోతే కోట్లతో సినిమా తీసి, దాని ఫేట్ నిర్ణయించే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం సినిమా హీరోహీరోయిన్లు చాలా తంటాలు పడుతుంటారు. రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. లైమ్ లైట్‌లో వుంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఏదో ఉత్సుకతను రేకిత్తిస్తుంటారు. 
 

vijay, Samantha dance
ఇటీవల యువ హీరో విజయ్ దేవరకొండ(VD) కూడా తన ఇన్‌స్టాలో ఎవరో లేడీ చేయిని పట్టుకున్న ఫోటో ఒకటి పెట్టాడు. దానికి క్యాప్షన్.. చాలా జరిగిపోయాయి, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ అంటూ ఇచ్చాడు. ఇక అక్కడ్నుంచి నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందించడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఒకరు రాస్తే... ఆ లేడీ చేయి ఎవరిదన్న దానిపై మరో చర్చ మొదలైంది. చాలామంది అది రష్మిక మందనదేనంటూ తేల్చి చెబుతున్నారు. విజయ్ పెళ్లి చేసుకోబోయేది కూడా ఆమెనే అంటూ రాసేస్తున్నారు.
 
Rashmika Mandanna
కర్టెసి-ట్విట్టర్
ఇదంతా ఇలావుంటే... అదంతా ఖుషీ చిత్రం కోసమే విజయ్ దేవరకొండ ఇలా పోస్టు పెట్టాడంటూ మరికొందరు అంటున్నారు. లైగర్ బిగ్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారనీ, అందుకోసమే మొన్నామధ్య సమంతతో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ చేసాడనీ, ఇపుడేమో ఇలా రెండు చేతులు పట్టుకున్నట్లు పోస్ట్ పెట్టారని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ చర్చల్లో నిజమేంటో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.