శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (10:56 IST)

సమంత, నావి ఆలోచనలు ఒకేలా ఉంటాయి : విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda
సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది అని విజయ్ దేవరకొండ అన్నారు. 
 
తన కొత్త సినిమా ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి డీటెయిల్డ్ గా చెప్పారు విజయ్. ఈ లైవ్ ఇంటర్వ్యూలో ఖుషి హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఖుషి జర్నీ గురించి మాట్లాడారు.