1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (17:40 IST)

అల్లు రామలింగయ్యకు పూజ్యస్థానం కల్పించిన మెగాస్టార్‌ చిరంజీవి

chiru pooja gadi
chiru pooja gadi
కొందరు మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం వుంటుంది. కానీ మెగాస్టార్‌ చిరంజీవి ఆ విషయంలో మినహాయింపు వుంటుందని అర్థమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీమణులు విజయదుర్గ, మాధవి రావులు రాఖీ కట్టారు. ఈరోజు ఉదయమే వారు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన పూజ చేస్తున్న గదిలో దేవునిముందు రాఖీలుకట్టడం విశేషం. విజయదుర్గ కుమారుడు సాయితేజ్‌ మెగా కుటుంబ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇటీవలే బ్రో సినిమాను పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించారు.
 
Chiranjeevi, Vijaydurga, Madhavi Rao
Chiranjeevi, Vijaydurga, Madhavi Rao
కాగా, ఈరోజు ప్రత్యేకత ఏమంటే, చిరంజీవి పూజగదిలోని పూజ మండపంలో తన మామగారైన అల్లు రామలింగయ్య ఫొటోను పెట్టి ఆయనకూ రోజూ పూలు సమర్పించి తలచుకుంటుంటారు. తన మామగారు లేనిదో నేను ఈ స్థాయిలో వుండేవాడిని కాదని పలుమార్లు వెల్లడించారు. కనుకనే అల్లు రామలింగయ్యగారి పేరుమీద ఇటీవలే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో తన మామయ్యగారితో వున్న అనుబంధాలను వివరించారు. ఆనాటి కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హారయ్యారు. 
 
పూజ మండపంలో అల్లు రామలింగయ్యగారి ఫొటోను చూసి మెగాస్టార్‌ అభిమానులు చిరంజీవిపై మరింత ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.