ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (12:06 IST)

ఇలాంటి అమ్మాయి నా లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటున్నా: విజయ్ దేవరకొండ

Samantha- vijay
Samantha- vijay
హీరో  విజయ్ దేవరకొండ పర్సనల్ విషయాలు ఎల్లా వెల్లడించారు.  నా ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నా. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా.
 
నాకు ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్ లా అనిపించింది. ఖుషి షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్ అయింది. మా  ఫ్రెండ్స్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్ ప్రెన్యూర్ లో కొద్ది రోజుల్లోనే నా నుంచి ఒక ప్రకటన వస్తుంది.
 
నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా.
 
నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. నేను వర్క్ లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఇయర్, నెక్ట్ ఇయర్ అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా మ్యారేజ్ జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను అని అన్నారు.

గ్లాడియేటర్ నా ఫేవరేట్ మూవీ. పోకిరి సినిమాలో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా మూవీలో ఒకటి పెట్టుకోవాలి. అదెప్పుడు కుదురుతుందో చూడాలి.