యువతకు దిశానిర్దేశం చేస్తున్న సీనియర్ నటుడు ప్రదీప్
అంతేగా, అంతేగా.. అంటూ ఒక్క డైలాగ్‌తో ఎఫ్2, ఎఫ్ 3లలో అలరించిన నటుడు ప్రదీప్ గతంలో హీరో. ఆయన 1980 కాలంలో ముద్దమందారం వంటి పలు సినిమాల హీరోగా చేశాడు. అప్పట్లో జంథ్యాలగారు ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. 10 సినిమాలు చేశాక లైఫ్‌లో ఏదో వెలితి కనిపించిందట. అందుకే తనలోని ఇన్నర్‌గా వున్న మరో కోణాన్ని బయటకు తేవాలని సినిమాలకు దూరంగా వుంటూ సి.ఎ. అభ్యసించారు. దానితోపాటు పలు కోర్సులు చేశారు. ఇప్పుడు మంచి స్పీకర్‌గా ఎదిగారు. లలిత కళలు నేర్చుకున్నారు. అవసమైతే నేటికీ మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలు తెస్తానని తెలియజేస్తున్నారు.
ఇప్పటికీ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఆయన అనుభవాలు తెలియజేస్తూ, నేటి యువతకు చిన్న సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు అనుభవం రేపటికి నిర్దేశం. అందుకే ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే మంచైనా చెడైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. రానురాను అందులో మెచ్యూరిటీ వస్తుంది అభివృద్ధి కాగలరు. మార్పు ఒక్కరోజులో రాదు. ఏదైనా సక్సెస్ రావాలంటే లాంగ్‌టర్న్ విజువలైజేషణ్ చేసుకోవాలి. కానీ నేటి యూత్‌కు రాత్రి రాత్రే ఎదగాలనీ రకరకాల వ్యాపకాలు చేస్తూ దేనిపైనా పూర్తి అవగాహన లేకుండా చేసుకుంటున్నారు. ఈరోజు ఒక రంగంలో వుండి, మరో రోజు మరో రంగంలో వుంటూ ఇలా దేనిలోనూ గెలుపొందక నిరుత్సాహపడుతుంటారు. ఇది వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. కనుక ఏరంగంలోనైనా సక్సెస్ రావాలంటే అందుకు చాలా ఓపికకావాలి. ఇది నేటి యువత తెలసుకోవాలని సూచించారు.