బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (13:10 IST)

భారత మార్కెట్లోకి శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎఫ్34 5జీ

samsung galaxy f34 5g
samsung galaxy f34 5g
భారత మార్కెట్లోకి శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎఫ్34 5జీ వచ్చేసింది. 6,000mAh బ్యాటరీతో ఈ ఫోను మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకా ఈ ఫోనులో Exynos 1280 SoC, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో భారతదేశంలో విడుదల చేసింది. ధరలు రూ. 18,999.
 
50MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాలు అరుదుగా వస్తున్నాయి. ఈ Samsung Galaxy F34 5Gలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 13 MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. 
 
ఇది ఆక్టా కోర్ Exynos 1289 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 సాఫ్ట్‌వేర్‌ను రన్ చేస్తుంది.
 
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తోంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, GPS, NFC, Wi-Fi, బ్లూటూత్ V5.3, USB టైప్-సి ఉన్నాయి. ఈ మోడల్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. 
 
హ్యాండ్‌సెట్ బరువు 208 గ్రాములు. శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎఫ్34 5జీ 6GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999. 8GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999.