సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (13:33 IST)

బాలయ్యతో రొమాన్స్ చేయనున్న మీనాక్షి చౌదరి?

Balakrishna
Balakrishna
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని టాక్‌. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయంపై తాజాగా ప్రచారం జరుగుతోంది. 
 
తాజాగా బాలకృష్ణకు జోడీగా మీనాక్షి చౌదరి ఎంపికైందని సమాచారం. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 
 
ముఖ్యంగా బాలయ్య గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బాబీ బాలయ్య అభిమానుల కోసం ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇది బాలయ్య తరహా యాక్షన్ డ్రామా కాదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 
 
కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజకీయాల నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ సినిమాలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుతం బాలకృష్ణ టాలీవుడ్‌లో బాగా హైప్ చేయబడిన చిత్రాలలో ఒకటిగా ఉన్న భగవంత్ కేసరి కోసం పనిచేస్తున్నారు.