శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:39 IST)

కవల పిల్లల ఫోటోలను తొలిసారి షేర్ చేసిన నయన్-విక్కీ

Twins
Twins
గతేడాది జూన్‌లో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన వెంటనే, అద్దె తల్లి ద్వారా కవలలు జన్మించారు. ఇద్దరూ తరచూ తమ పిల్లలతో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల నయనతార తన ఇద్దరు పిల్లలతో కలిసి మాస్ వీడియోను పంచుకోవడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
 
ఇదిలా ఉంటే, విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ తమ కవలల పుట్టినరోజు సందర్భంగా ఒక ఫోటోను విడుదల చేశారు. తన ప్రియమైన కుమారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఇంకా తొలిసారి నయన్ - విఘ్నేశ్‌ల ముఖాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.