సోమవారం, 26 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:07 IST)

నయనకు భారీ బాలీవుడ్ ఆఫర్స్.. పారితోషికం అంత డిమాండ్ చేస్తోందట!

Nayanatara
బాలీవుడ్‌ నుంచి దక్షిణాది సూపర్ స్టార్ నయనతారకు ప్రస్తుతం భారీ ఆఫర్స్ వస్తున్నాయట. బాలీవుడ్‌లోని బడా మేకర్స్ ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి క్యూ కడుతున్నారట. 
 
సౌత్ వరకే పరిమితమయ్యే తన సినిమాలకు 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్న నయనతార, పాన్ ఇండియా సినిమాలకుగాను 10 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే ఈ పారితోషికాన్ని బాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్స్ అందుకుంటున్నారు. అదే స్థాయిలో ప్రస్తుతం నయనతార కూడా డిమాండ్ చేస్తుండటం గమనార్హం. 
 
షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.