శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (15:34 IST)

"మంచి సమయం మొదలైంది".. నయనతార ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Nayanatara
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ అరంగేట్రం భారీ విజయం సాధించింది. ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి "జవాన్" చిత్రంలో నటించింది. ఇది ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.
 
 ఈ సందర్భంగా నయనతార తన భర్త ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "మంచి సమయం మొదలైంది" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేస్తూ తన జవాన్ సక్సెస్‌ను గుర్తు చేసుకుంది. 
 
"జవాన్" విడుదలకు ముందు నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన భర్త, కవలపిల్లల ఫోటోలను నెట్టింట పోస్టు చేస్తోంది. ఈ ఫోటోలకు, నయనతార పోస్టులకు ఆమె ఫ్యాన్స్ భారీగా లైక్స్ చేస్తున్నారు.