సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (15:17 IST)

నాగ చైతన్య టాటూని సమంత తొలగించిందా?

Samantha
Samantha
నాగ చైతన్య టాటూని సమంత తొలగించిందా? తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలలో ఈ టాటూ కనిపించడం లేదు. సమంత కుడి పక్కటెముకల మీద ఈ టాటూ కనిపించింది. నాగ చైతన్య - సమంతలు వివాహం చేసుకున్నారు. 
 
నాలుగేళ్ల తర్వాత వారు హఠాత్తుగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత కూడా సమంత శరీరంపై చైతన్య టాటూ అలాగే ఉండటం అభిమానుల దృష్టిని చాలాసార్లు ఆకర్షించింది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో మాత్రం ఆ టాటూ కనిపించడం లేదు. 
 
తాజాగా సమంత పింక్ చీరలో ఫోజులిచ్చిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికీ తన స్టైల్‌తో యంగ్ జనరేషన్‌కి ఫ్యాషన్ పాఠాలు చెబుతున్న సామ్ ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది. 
 
 
 
2019లో చైతన్యతో ఉన్నప్పుడు సమంత ఈ టాటూను ఇంక్ చేసింది సమంత. కుడి పక్కటెముకలపై ఆంగ్ల అక్షరాలు చాయ్ అని స్పష్టంగా కనిపిస్తున్నాయి. గులాబీ రంగు చీరలో సామ్ షేర్ చేసిన ఈ తాజా ఫోటోల్లో అక్షరాలు కనుమరుగయ్యాయి.
 
 
విడిపోయిన తర్వాత కూడా సమంత షేర్ చేసిన ఫొటోల్లో ఈ టాటూ కనిపించింది. అయితే ఈ తాజా ఫోటోల్లో అది మిస్సయింది. దీంతో ఆమె ఆ టాటూను తొలగించాలా.. లేక కనిపించకుండా కవర్ చేశారా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.