1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Regina Cassandra gave the videographer a lesson.

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Regina Cassandra
Regina Cassandra
సినీ హీరోయిన్లు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయితే వీడియోగ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు చాలా హంగామా చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు వారిని అడ్డుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. తాము వేసుకున్న దుస్తులతో పొటోలు తీయమని అడిగితే, డ్రెస్ మార్చుకుని రమ్మని అడిగిన ఫొటోగ్రాఫర్ల కూడా వున్నాయి. తాజాగా నేడు రెజీనా కాసండ్ర వీడియోగ్రాఫర్ పట్ల సున్నితంగా మందిలిస్తూ వారికి క్లాస్ పీకిన సందర్భం హైదరాబాద్ లో జరిగింది.
 
హైదరాబాద్‌లో జరిగిన ఒక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొన్న నటి రెజీనా  మీడియా ప్రతినిధులపై సున్నితంగా అసహనం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్లు లైటింగ్‌కు అడ్డంగా నిలబడటంతో, "అన్నా.. మీరు లైట్ ముందు వస్తే ఎలా? మీ పిక్చర్ కూడా సరిగ్గా రాదు," అంటూ ఆమె పేర్కొన్నారు. అందరికీ ఫోటోలు ఇస్తానని, కాసేపు వేచి ఉండాలని కోరుతూనే, క్రమశిక్షణతో ఉండాలని ఆమె సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రెజీనా చూపించిన సహనం అభినందనీయంగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
 
తాజాగా తమిళ సినిమాలో రెజినా నటిస్తోంది. జాట్, కేసరి చాప్టర్ 2 చిత్రాల్లో గత ఏడాది విడుదలయ్యాయి. 2026లో తన కెరీర్ పై మరింత ఫోకజ్ చేస్తున్నానని తెలిపింది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి