1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Young Girl suicide in Hyderabad,

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లి కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోప్నివాల్ విజయలక్ష్మి (26)కి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. 
 
తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. ప్రస్తుతం కూకట్పల్లి పరిధి మైత్రినగరులో ఉంటున్నారు. తల్లికి అన్నీ తానై సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఐటీ సంస్థలో ఉద్యోగంచేస్తున్న ఆమెకు ఇటీవల వివాహసంబంధాలు వచ్చాయి. తల్లి తనతోపాటే ఉంటుందని నిబంధన పెట్టడంతో కుదరలేదు.
 
దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సమీప బంధువు అభిషేక్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. హుసేన్ సాగర్‌లో యువతి మృతదేహం సోమవారం తేలడంతో లేక పోలీసులు విషయాన్ని కూకట్‌పల్లి పోలీసులకు తెలపగా వారు ఆ మృతదేహం కూకట్ పల్లిలో అదృశ్యమైన విజయలక్ష్మిదేనని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
భారత వస్తువులపై సుంకాలు.. 50 నుంచి 18 శాతానికి తగ్గించిన ట్రంప్.. మోదీ హ్యాపీ