సంబంధిత వార్తలు
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ - స్టాక్ మార్కెట్, వెండి సంగతేంటి?
- నేడు కేంద్ర వార్షిక బడ్జెట్ : మరింతగా తగ్గిన పసిడి ధరలు
- అనంతపురంలో కొత్త ప్రదేశంలోకి మార్చబడిన నూతన షోరూమ్‌ను ప్రారంభించిన మలబార్ గోల్డ్- డైమండ్స్
- 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)
- Sabarimala: అయ్యప్ప బంగారం అదృశ్యం.. జయరామ్ వద్ద సిట్ విచారణ
Gold Silver Rates: కొండెక్కిన బంగారం ధరలు దిగొస్తున్నాయి.. పసిడి ప్రియులు హ్యాపీ
కొండెక్కిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది బంగారం ధర ఏకంగా 70 శాతం వరకు పుంజుకుంది. ఇక ఈ ఏడాది కూడా జనవరిలో విపరీతంగా పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర అంతకుమించి పెరిగింది.
అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరగడంతో.. అటువైపు పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే బంగారం ధర కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు దిగొచ్చాయి. జనవరి 29 నుంచి గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనమైన సంగతి తెలిసిందే.
బంగారం ధర 20 శాతం వరకు.. వెండి ధర ఏకంగా 40 శాతం వరకు దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 6800 తగ్గి తులం రూ. 1,40,400 కు చేరింది. కిందటి రోజు ఒక దశలో ఇది రూ. 12 వేలకుపైగా తగ్గినట్లు చూయించింది.
ఇక వెండి ధర చూస్తే మళ్లీ రూ. 20 వేలు తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ. 3 లక్షల స్థాయికి దిగొచ్చింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి ఇక్కడ జనవరి 29న వెండి ధర రూ. 4.25 లక్షలుగా ఉండటం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే రూ. 1.25 లక్షలు పతనమైంది.
