అభిమాని బైకుపై మరకలు.. టీ షర్టుతో శుభ్రం చేసిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లు అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీకి ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజే వేరు. ఇదే క్రమంలో ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీని ఓ అభిమాని కలిశాడు. అనంతరం తన బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ కోరాడు. ఫ్యాన్ కోరికను మన్నించిన ధోనీ బైక్ ముందు భాగంలో సంతకం చేసేందుకు సిద్ధమయ్యాడు.
కానీ.. బైక్ మీద మరకలు కనిపించడంతో తన టీషర్టుతో స్వయంగా దానిని శుభ్రపరిచాడు. అనంతరం బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను ఖుషీ చేశాడు. అంతేకాదండోయ్ ఆ ఖరీదైన బైక్ మీద ఎక్కి.. ఆ బైక్ విశేషాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ గ్యారెజ్‌లో అనేక రకాల బైక్‌లున్న సంగతి తెలిసిందే.