గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 మే 2024 (10:12 IST)

103 యేళ్ల అభిమానికి బహుమతి పంపిన ధోనీ!!

jersey
చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని 103 యేళ్ళ ఎస్.రాందాస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన బహుమతిని పంపించారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీని తన సంతకంతో పాటు ప్రత్యేక సందేశం రాసి రాందాస్‌ తనయుడికి అందజేశారు. 
 
"థ్యాంక్స్ తాత.. ఫర్ సపోర్ట్" అనే సందేహాన్ని జెర్సీపై ధోనీ రాయడం వీడియోలో ఉంది. ఇక ధోనీ పంపిన జేర్సీని చూసి పెద్దాయన హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోలు చెన్నై ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీంతో ఈ విషయం కాస్త వైరల్ అయింది. గతంలోనూ జట్టుపై రాందాస్ అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ ద్వారా పంచుకున్న విషయం తెల్సిందే.