ధోనీ సిక్సర్ల మోత.. షాకైన సారా టెండూల్కర్.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో వెటరన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు మిగిలి ఉండగానే ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు.
అయితే అతను హార్దిక్ పాండ్యాను బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్‌లతో కొట్టాడు. ధోని ఆడిన ప్రతి పెద్ద షాట్‌తో ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ధోనీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యింది.
ఈ మ్యాచ్‌లో, రోహిత్ శర్మ భీకర సెంచరీ సాధించాడు. అయితే అది ఫలించలేదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన బ్యాటింగ్‌కు సిక్సర్ల మోత మోగించడం చూసి షాక్ అయ్యింది. ఆ షాక్ నుంచి ఆమె తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.