ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:49 IST)

ఐపీఎల్‌లో సంచలన రికార్డును నెలకొల్పిన ధోనీ... ఏంటది?

ms dhoni
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 పోటీల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, ఆ జట్టు ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ చెలరేగి ఆడిన విషయం తెల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్, బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న 4 బంతుల్లో 20 పరుగులు పిండుకున్నాడు. వరుస సిక్సర్లతో వాంఖడే స్టేడియాన్ని మోతెక్కించాడు. అదిరిపోయే రేంజ్‌లో ఇన్నింగ్స్‌ను ముగించిన ధోనీ చెన్నై స్కోరు 200 దాటించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ధోనీ ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. 
 
ఐపీఎల్ ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లకుగా మలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. గతంలో భారత ఆటగాళ్లు ఎవరూఈ తరహా ఫీట్‌ను సాధించలేదు. ఇక ఐపీఎల్ మొత్తంమీద ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. 
 
గతంలో ఐపీఎల్‌లో తాము ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మార్చిన క్రికెటర్లను పరిశీలిస్తే, 2021లో ఆర్సీబీపై కేకేఆర్ మ్యాచ్12వ ఓవర్‌లో సునీల్ నరైన్, 2023లో సన్ రైజర్స్ జట్టుపై లక్నో మ్యాచ్ 16వ ఓవర్‌లో నికోలస్ పూరన్, 2024లో ముంబైపై సీఎస్కే మ్యాచ్‌ 20వ ఓవర్‌లో ధోనీ వరుస సిక్సర్లు బాది తొలి భారతీయ బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.