1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (12:12 IST)

ధోనీ పాదాలను తాకిన మతీషా పతిరానా.. ఎవరతను?

Dhoni
Dhoni
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని సీఎస్కేకి స్ఫూర్తిదాయక వ్యక్తి. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. 2024 సీజన్‌కు ముందు ధోనీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయినా ధోనీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ జరుగుతుండగా ఇప్పటికీ టీవీ స్క్రీన్‌పై తన ముఖం కనిపించినప్పుడల్లా బిగ్గరగా అరిచి ఆనందాన్ని పొందే ఫ్యాన్స్ వున్నారు. 
 
కాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా బౌలింగ్ ప్రారంభించే ముందు ధోని పాదాలను తాకాడు. ధోనీ వారిస్తూనే అతనిని ఆశీర్వదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.