గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (13:25 IST)

42 ఏళ్ల వయసులోనూ ధోనీ అదుర్స్.. స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

Dhoni
Dhoni
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. 42 ఏళ్ల వయసులోనూ తన కీపింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కేవ‌లం 0.6 సెక‌న్ల‌లోనే క్యాచ్ పట్టేశాడు. 
 
కుడి వైపు డైవ్ చేస్తూ క్యాచ్‌ను ప‌ట్టేశాడు. ఇక క్యాచ్‌ను వీక్షించిన స్టేడియంలోని ప్రేక్ష‌కులు, అభిమానులు .. ధోనీ కీపింగ్ సామ‌ర్థ్యానికి ఫిదా అవుతున్నారు.
 
వికెట్ల వెనుకాల ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్ నిరాశగా వెనుదిరిగాడు. డారిల్ మిచెల్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో చెన్నై 63 ర‌న్స్ తేడాతో నెగ్గింది.