Vikarabad: ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం భార్యను కొట్టి చంపేసిన భర్త (video)
Dowry Crime
వివరాల్లోకి వెళితే.. తాండూరులోని సాయుపూర్‌కు చెందిన పరమేశ్‌తో అనుష (22)కు 8 నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వివాహం తర్వాత అనుష తన భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. గత కొన్నిరోజులుగా అనుషకు వరకట్న వేధింపులు ఎదురవుతున్నాయి. కట్నం తీసుకురావాలని అత్త, మామ, భర్త వేధించడం మొదలుపెట్టారు.
ఇంకా అనుషపై పరమేశ్ దాడి చేశాడు. దీంతో పుట్టింటికి వెళ్లేందుకు అనుష సిద్ధమైంది. సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్లనున్న అనుషను పరమేశ్ ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆస్పత్రికి ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడైనాడని తల్లిదండ్రులు రోదించారు.
షాకింగ్ విజువల్స్
— Telugu Feed (@Telugufeedsite) December 19, 2025
ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్త
వికారాబాద్ జిల్లా సాయాపూర్లో గ్రామంలో విషాదఛాయలు
కట్నం తేవాలని అవమానకరంగా దూషిస్తూ, కర్రతో బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
8 నెలల కిందట వివాహం..… pic.twitter.com/ywgekrgeH7
