శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (19:03 IST)

ధోనీని టీమిండియాకు కెప్టెన్ చేసింది నేనే.. సచిన్ టెండూల్కర్

ms dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సారథ్యంపై సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఎంపిక కావడానికి తాను ఓ కారణమని సచిన్ వెల్లడించాడు. ''2007లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నన్ను తీసుకోమని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ కోరారు. 
 
తన ఆరోగ్యం సహకరించట్లేదని.. ఓ కెప్టెన్ ప్రతిసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి తన చీలమండకు పట్టీలు వేసుకోవడం, తన భుజానికి చికిత్స తీసుకోవడం చేస్తూ ఉంటే బాగుండదు. అది జట్టుకే మంచిది కాదు. ధోనీని కెప్టెన్ చేయమని సలహా ఇచ్చాను... అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. 
 
ధోనీ గురించి నాకు బాగా తెలుసు. అతని ఆటతీరుతో పాటు ఆయనకు క్రికెట్ పట్ల వున్న అవగాహనను తెలుసుకునే ఈ పని చేశానని సచిన్ వెల్లడించాడు.