గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (18:57 IST)

అభిమానికి షాకిచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. ఏం చేశాడంటే?

Sachin
Sachin
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమానికి అనూహ్య సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన జీవితంలో ఎన్నడూ మరిచిపోని అనుభూతిని మిగిల్చాడు. రోడ్డుపై వెళ్తున్న తన అభిమాని కోసం కారును ఆపి.. అతనిని పలకరించాడు. 
 
సచిన్ పట్ల ఆ అభిమానికి వున్న ప్రేమను కళ్లారా చూసి ఆనందించాడు. ఇక ఆ అభిమాని పరిస్థితి చెప్పనక్కర్లేదు. తన అభిమాన క్రికెటర్, క్రికెట్ దేవుడిని ప్రత్యక్ష్యంగా చూడటం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సచిన్‌ను చూసిన వెంటనే ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. 
 
హెల్మెట్ కూడా విప్పకుండా సచిన్‌ను పదే పదే చూస్తూ ఇదంతా కలా లేక నిజమా అన్నట్లు చూస్తుండి పోయాడు. సచిన్‌ను చూసి చేతులెత్తి నమస్కరించాడు. 
 
ఆపై తన వద్ద వున్న సచిన్ జ్ఞాపకాలతో కూడిన డైరీని మాస్టర్ బ్లాస్టర్‌కి చూపెట్టాడు. అదంతా చూసి సచిన్ హ్యాపీగా ఫీలయ్యాడు. తర్వాత సచిన్‌తో ఆ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు. కారు నుంచి కదిలే వరకు ఆ ఫ్యాన్ సచిన్‌ చూస్తూ ఆనందించాడు. 
 
ఈ సందర్భంగా "నాపై సచిన్ ప్రేమను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఊహించని రీతిలో ఆరాధించే వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ జీవితాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది." ఆ అభిమాని వెల్లడించింది.