లెజెండరీ క్లాసికల్ సింగర్ దీనానాథ్ మంగేష్కర్ మృతి
ప్రముఖ క్లాసికల్ సింగర్ ప్రభా ఆత్రే ఒకరు. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె శనివారం కన్నుమూశారు. లెజెండరీ క్లాసికల్ సింగర్, పద్మ అవార్డు గ్రహీత ప్రభా ఆత్రే (91) శనివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడటంతో కుటుంబ సభ్యులు పూనేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గుండెపోటుతో కన్నుమూశారు.
పూనేలో అబాసాహబ్, ఇందిరాబాయి దంపతులకు ప్రభా ఆత్రే సెప్టెంబర్ 13, 1932 లో జన్మించారు. తన ఎనిమిదేళ్ల వయసులో తన తల్లి ఇందిరాబాయి కోసం సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రభా ఆత్రే ప్రతిభకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ విభూషన్, పద్మ భూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఆమె ఎన్నో దేశాల్లో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.