గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (18:41 IST)

గుండెపోటుతో 24 ఏళ్లలోనే మలయాళ నటి లక్ష్మీకా మృతి

Lakshmika Sajeevan
Lakshmika Sajeevan
వర్ధమాన మలయాళ సినీతార, టెలివిజన్ నటి లక్ష్మీకా సజీవన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. 
 
"‘కాక్క"షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మీకకు మంచి పేరు వచ్చింది. ఆమె పంచవర్ణతత, సౌదీ వెల్లక్క, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాధక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్మర్ సల్మాన్ వంటి చిత్రాలలో నటించారు.
 
నవంబర్ 2న లక్ష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సూర్యాస్తమయానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది.