సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (13:18 IST)

తెలంగాణలో రాబోయేది రావణ సామ్రాజ్యం: సినీ నటి మాధవీలత సంచలన పోస్ట్

madhavilatha
మాధవీలత. సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అనేక సమస్యలపై మొహమాటం లేకుండా ట్వీట్స్ పెడుతుంటారు. అలాగే నేరుగా వీడియోలో సైతం మాట్లాడేస్తుంటారు. ఇపుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వంపై సంచలన పోస్ట్ చేసి చర్చనీయాంశంగా మారారు. అదేమిటో చూద్దాము.
 
మాధవీలత తన ఇన్‌స్టా పోస్టులో ఇలా వ్యాఖ్యానించింది. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరుగబోయే దారుణాలు ఇవే. ఫుడ్ వుండదు, ఉద్యోగాలు వుండవు, మహిళలకు భద్రత వుండదు. శాంతి వుండదు, ఎంజాయ్ చేయండి, తెలంగాణ కాంగ్రెస్ లవర్స్‌కి గుడ్ లక్, ఇక రావణ సామ్రాజ్యం మొదలు. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్‌కి నా మార్కులు 99" అంటూ రాసింది మాధవీలత. ప్రస్తుతం ఈ పోస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.