1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (11:17 IST)

బెంగళూరులో సహజ పవర్‌హౌస్‌ల జత నాని, శివరాజ్ కుమార్

Nani, Shivraj Kumar,  geeta, madhu
Nani, Shivraj Kumar, geeta, madhu
కన్నడ సినీరంగంలో శివన్న అని ముద్దుగాపిలుచుకునే శివరాజ్ కుమార్ ను తెలుగు కథానాయకుడు నాని ఈరోజు బెంగుళూరులో కలుసుకున్నారు. దక్షిణాది భాషలలో నాని నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ ౭న విడుదలకానుంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను పర్యటించి అక్కడి హీరోలను నాని కలుసుకుంటున్నారు. అందులో భాగంగా శివన్నను కలిసి తన సినిమా గురించి చైల్డ్ సెంటిమెంట్ గురించి వివవరించారు. బెంగళూరులో సహజ పవర్‌హౌస్‌ల జత అంటూ చిత్ర యూనిట్ కాప్షన్ జోడించి ఫొటోలు పోస్ట్ చేసింది.
 
Nani, Shivraj Kumar
Nani, Shivraj Kumar
ఇది యూనివర్సల్ కంటెంట్ అని నాని చెప్పారు. గతంలో కూడా నాని తన సినిమాల విడుదలకు ఇలా కలుసుకోవడం అలవాటు చేసుకున్నారు. అక్కడ థియేటర్ల సమస్య తలెత్తకుండద అభిమానుల నుంచి వ్యతిరేకతల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఓ హీరో సినిమా విడుదలయితే ఆ సినిమాను కన్నడలో కొన్ని చోట్ల విడుదల చేయనీయలేదు. 
 
ఇక  'హాయ్ నాన్న' సినిమాను  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా నిర్మించింది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది.