ఈ హీరోయిన్‌కి ఇన్‌స్టాగ్రాంలో 1,20,000 మంది ఫాలోయర్లు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2 వేల ఓట్లు
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
సినిమాల్లో సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు కొందరు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత.. ఇలా కొందరు తారలు ఏకంగా ముఖ్యమంత్రులుగా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఐతే మరికొందరు మాత్రం రాజకీయాల్లో ఫెయిల్ అయి తిరిగి సినిమాలకే అంకితమయ్యారు.
అసలు విషయానికి వస్తే... పాపులర్ బుల్లితెర హీరోయిన్ చాహత్ పాండే మొన్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఐతే ఆమెకి ఈ ఎన్నికల్లో కేవలం 2,297 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆమెకి ఇన్ స్టాగ్రాంలో వున్న ఫాలోయర్ల సంఖ్య 1,20,000 మంది. కాబట్టి ఫాలోయింగ్ వేరు పాలిటిక్స్ వేరు అని ఇలాంటి ఘటనలు చెబుతుంటాయి.