శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:29 IST)

నన్ను రేప్ చేసినవాడు 6 నెలలు తిరక్కుండానే చచ్చిపోయాడు: సీనియర్ నటి

Actress jayalalitha
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వున్నదని చెప్పేందుకు ఎన్నో ఉదంతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సీనియర్ నటి, క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలిత క్యాస్టింగ్ కౌచ్ పైన షాకింగ్ విషయాలు వెల్లడించారు. మలయాళం సినిమాలో నటించే సమయంలో తనకు భయంకరమైన చేదు ఘటన ఒకటి జరిగిందని ఆమె వెల్లడించారు.
 
ఆమె మాటల్లోనే... సీన్ చెప్తాను రమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గదిలోకి పిలిచాడు. అక్కడ రేప్ సీన్ గురించి వివరిస్తాడని అనుకుంటే... వెంటనే తలుపులు వేసి గడియపెట్టేసాడు. తనపై అఘాయిత్యం చేసేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిసి అతడి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వల్లకాలేదు.

చివరికి అతడు తనపై అత్యాచారం చేసాడనీ, ఇలాంటి ఘటన ఎక్కడా చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పక తప్పడంలేదని వెల్లడించింది. ఐతే తనపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ 6 నెలలు తిరక్కుండానే చనిపోయాడని ఆమె చెప్పింది.