శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (08:42 IST)

యూపీలో దారుణం.. బాలికను వేధించి.. శానిటైజర్ తాగించారు..

victim
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ బాలికను నానా రకాలుగా వేధించారు. ఆ తర్వాత శానిటైజర్ తాగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ భయానక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలీకి చెందిన 16 యేళ్ళ విద్యార్థిని గత నెల 27వ తేదీన స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అనే పోకిరి వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు. 
 
అదేసమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించాడు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాలిక శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.