శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (08:25 IST)

చిన్నారుల అక్రమ రవాణా మూడో స్థానంలో ఏపీ - అమ్మాయిల మిస్సింగ్‌లో...

Missing
చిన్నారుల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్టు 24*7 అనే స్వచ్చంధ సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. అలాగే, గత మూడేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా 13.13 లక్షల మంది కనిపించకుండా పోయారు. వీరిలో అత్యధిక సంఖ్యలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అయ్యారు. అమ్మాయిల మిస్సింగ్ కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
దేశ వ్యాప్తంగా గత 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది కనిపించకుండా పోయారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతవారం పార్లమెంట్‌ వేదికగా గణాంకాలను వెల్లడించింది. వీరిలో 18 ఏళ్ల పైబడిన మహిళలు 10,61,648 మంది ఉండగా, 18 ఏళ్ల లోపు బాలికలు 2,51,130 మంది ఉన్నట్లు పేర్కొంది. జాతీయ క్రైం బ్యూరో రికార్డుల్లో ఈ వివరాలు నమోదైనట్లు తెలిపింది. 
 
ఈ మిస్సింగ్ కేసుల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1,60,180 మంది మహిళలు, 38,234 బాలికలు అదృశ్యం కాగా, ఈ కేసుల్లో పశ్చిమ బెంగాల్ రెండోస్థానంలోనూ, ఏపీ ముూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ మూడేళ్లలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండా పోయినట్లు ప్రకటించింది. 
 
దీనిని అరికట్టేందుకు 2013 క్రిమినల్ (సవరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడే ళ్లలో సుమారు 70 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనట్లు ఇంతకుముందే కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.