సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (14:00 IST)

పరమశివుడిని పెళ్లాడిన యువతి... ఎక్కడ?

Lord shiva
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి పరమశివుడుని వివాహం చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాశంగా మారింది. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు.. చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. శివుడిపై మమకారాన్ని పెంచుకున్న వారి కుమార్తె ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. 
 
అందుకు తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని ఆ యువతి నిశ్చయించుకుంది. ఈ వివాహాన్ని సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలనుకున్న ఆ యువతి కుటుంబసభ్యులు నెల ముందుగానే ఏర్పాట్లను ప్రారంభించారు. 
 
ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులందరికీ పంచారు. ఆదివారం పరమశివుడితో ఆ యువతి పెళ్లి జరిపించారు. అనంతరం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పెళ్లి తంతు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.