సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్

aiden markram
ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన ప్రియురాలి నికోల్‌ని ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్కులో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను నికోల్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
కాగా, వీరిద్దరూ గత దశాబ్దకాలంగా సహజీవనం చేస్తున్నారు. గత యేడాది ఎంగేజ్మెంట్ చేసుకుని ఇపుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నికోల్ ఆన్‌లైన్ వేదికగా ఓ జ్యూవెలరీ షాపును నడుపుతుంది. మార్‌క్రమ్ 2023 ఏపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, ఈయన సారథ్యంలో ఎస్ఆర్కే జట్టు పేలవ ప్రదర్శనతో మొత్తం ఆడిన 14 మ్యాచ్‌లలో పదింటిలో ఓడిపోయి, కేవలం నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది.