శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఎక్కడ?

marriage
ఒరిస్సా రాష్ట్రంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సోన్పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ అనే వ్యక్తి మూడేళ్ళ క్రితం అనుగుల్ అనే ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, ఆమెకు అప్పటికే ఓ ప్రియుడు ఉన్నాడు. జిల్లి దూరపు బంధువైన పరమేశ్వరతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో గురువారం అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై మాధవ ప్రధాన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు గాలించి ఇద్దరిని ఠాణాకు తీసుకొచ్చారు. జిల్లిని ఠాణా అధికారి ప్రశ్నించగా పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విషయం మాధవ ప్రధాన్‌కు వివరించారు. మాధవ అంగీకారంతో ఆయన సమక్షంలోనే శనివారం రాత్రి వారిద్దరికి ఠాణాలో వివాహం చేశారు.