సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్లిన భర్తపై పెట్రోల్ పోసిన నిప్పంటించిన భార్య...

fire accident
కాపురానికి ఇంటికి రావాలంటూ పిలిచేందుకు వెళ్లిన భర్తపై కట్టుకున్న భార్య తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ట్రాన్స్ యమున కాలనీలోని తేవారి భాగియా ప్రాంతానికి చెందిన ప్రీతి, ధర్మేంద్ర అనే వారికి గత 2019 నవంబరు 8వ తేదీన వివాహం జరిగింది. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి ప్రీతి పుట్టింటిలోనే ఉంటూ వచ్చింది. పైగా, ప్రీతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని బాధితుడి సోదరుడు లోకేశ్ అంటున్నారు. 
 
ఈ క్రమంలో తన భార్యను కాపురానికి ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన ధర్మేంద్రపై భార్య ప్రీతి తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడి సోదరుడు లోకేశ్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రీతితో ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.