గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జులై 2023 (13:48 IST)

లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Varun Tej, Lavanya Tripathi
ఇటీవల విదేశాల్లో పెళ్లిళ్ల ట్రెండ్ ఎక్కువైంది. కాకపోతే జైపూర్ లాంటి చోట్ల సెలబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
 
నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. జూన్ 9న హైదరాబాద్‌లో ప్రేమ పక్షులు కుటుంబ సమేతంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్, లావణ్యల పెళ్లిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అప్పుడే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. 
 
తాజా సమాచారం ప్రకారం వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. దీనికి సంబంధించి ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. వరుణ్ తేజ్, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు. 
 
వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' తెరపైకి రావడానికి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 24న వీరిద్దరి పెళ్లి జరుగనుందని టాక్.