ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (19:03 IST)

వరుణ్‌ తేజ్‌, లావణ్య వివాహానికి భారీ ఖర్చు, జైపూర్‌లో వివాహం!

Varun Tej, Lavanya
Varun Tej, Lavanya
నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్‌ వివాహం లావణ్య త్రిపాఠితో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజే హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కొణిదెల కుటుంబం సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కాగా, ఇదేరోజు రాత్రి మాదాపూర్‌లోని ఎన్‌ కన్‌వెనెషన్‌ సెంటర్‌లో శర్వానంద్‌ వివాహ రిసెప్షన్‌ జరగబోతుంది. అతిరథ మహారథులు రాబోతున్నారు.
 
కాగా, వరుణ్‌తేజ్‌ వివాహం కూడా జైపూర్ ప్యాలెస్‌లో జరగనుందని సమాచారం. ఇందుకోసం వివాహ ఆహ్వాన పత్రిక కూడా భారీగా వుంటుంది. పెండ్లి కార్డ్‌ ఖరీదే 80వేలు దాకా వుంటుందని తెలుస్తోంది. కార్డుకు నాలుగువైపుల బంగారు పూత కోటింగ్‌ వేస్తున్నారట. ఇక పెండ్లయితే అంగరంగ వైభవంగా జరపాలని నాగబాబు పట్టుపట్టారని సమాచారం. ఇప్పటికే వరుణ్‌తేజ్‌ సినిమాకు దాదాపు 7నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. లావణ్య కూడా కోటి దాకా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వివాహం తర్వాత లావణ్య నటిస్తుందా లేదా? అనేది తెలియాల్సి వుంది.