ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (13:48 IST)

రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిచ్చితార్ధం

Varun-lavanya
Varun-lavanya
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వివాహానికి శుభం కార్డు పడిదింది. గత కొంతకాలంగా ఇద్దరకూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈవిషయాన్ని నాగబాబు ఖండించలేదు. తామే మీడియాకు తెలియాజేస్తామని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. 
 
జూన్ 9, 2023న నిశ్చితార్థం చేసుకోనున్నారని కొణిదల కుటుంబం అధికారికంగా కార్డు విడుదల జేసింది. హృదయపూర్వక అభినందనలు. కలిసి జీవించాలని కోరుకుంటున్నాము.  ఆశీర్వదించండి అని అందులో ఉంది. హైద్రాబాద్లో నాగబాబు ఇంటిలో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు కొణిదల కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, పరిమిత కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.