సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (10:38 IST)

ఇంటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం?

varun tej - lavanya
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం సింపుల్‌గా జరిగిపోయింది. ఇక అందరి దృష్టి పెళ్లి పైనే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? వివాహ వేదిక ఎక్కడ అంటూ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. ఇప్పటికైతే ఇటలీలో వీళ్ల వివాహం జరగబోతోందన్నాది కోలీవుడ్ వర్గాల టాక్. ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు క్రేజ్ ఎక్కువగా ఉంది. అందుకే ఇటలీలో పెళ్లి ఫిక్స్ చేశారని సమాచారం. ఇటలీనే ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణం లేకపోలేదు. వరుణ్, లావణ్యల ప్రేమ చిగురించింది అక్కడేనట. వీరిద్దరూ 'మిస్టర్' చిత్రంలో కలిసి నటించారు. అక్కడే వీరి ప్రేమ చిగురించింది. 
 
ఆ తర్వాత... 'అంతరిక్షం'లో మళ్లీ జోడీ కట్టారు. అప్పటికే వీరిద్దరూ ప్రేమ పక్షులుగా మారిపోయారు. తమ ప్రేమ పుట్టిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని వరుణ్, లావణ్యలు భావించారు. అందుకే ఇటలీని ఎంచుకొన్నారన్నది సమాచారం. 
 
నిశ్చితార్థం చాలా సింపుల్‌గా చేసుకున్నప్పటికీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేయాలని మెగా బ్రదర్ నాగబాబు కృతనిశ్చయంతో ఉన్నారట. వివాహ తేదీ కూడా నిర్ణయం అయిపోయిందని, త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.