శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (13:59 IST)

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపి ముక్కలు చేసిన భార్య..

murder
పరాయి వ్యక్తితో తాను సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధాని భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఓ భార్య అత్యంత కిరాతకంగా నడుచుకుంది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. శరీర భాగాగాలను సిమెంట్ బస్తాల్లో వేసి నదిలో పడేసింది. మృతుడి కుమారుడు తన తల్లిపై సందేహం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన భర్త రాంపాల్ (55) కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలించసాగారు. అయితే మృతుడి కుమారుడు మాత్రం కన్నతల్లిపై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడించింది. మరో వ్యక్తితో సాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. పైగా, భర్త మృతదేహాన్ని ముక్కలు చేసి... తాము నివసించే ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే నదిలో పడేసినట్టు చెప్పింది. దీంతో