1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (23:25 IST)

ఆమెను హత్తుకుని బోరున ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్.. ఎందుకో తెలుసా?

siddharth
హీరో సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం 'టక్కర్'. శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో సిద్ధార్థ్ వేదికపై బోరున ఏడ్చేశారు. ఒక పెద్దావిడ పాదాలకు నమస్కారం చేసి, ఆమెను హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇంతకీ సిద్ధార్థ్ ఏడవడానికి గల కారణాలను తెలుసుకుందాం.. 
 
దర్శకుడు కావాలనుకున్న సిద్ధార్థ్ ఓ మహిళ వల్ల హీరోగా ఎదిగి స్టార్ అయ్యారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
సుజాత రంగరాజన్... ఈవిడే లేకపోతే సిద్ధార్థ్ హీరో అయ్యేవాడు కాదు. తనకు సినీ జీవితాన్నిచ్చిన ఆమెను చూసి ఓ ఇంటర్వ్యూలో అతడు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. 'టక్కర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ సుజాత రంగరాజన్ వేదికపైకి వచ్చారు. 
 
ఆమెను చూసిన వెంటనే సిద్ధార్థ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించి.. ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. 'ఈవిడ పేరు సుజాత. నన్ను 'బాయ్స్' సినిమాలో హీరోగా తీసుకోవాలని దర్శకుడు శంకర్‌ను కోరకపోతే.. నా జీవితం ఈరోజు వేరేలా ఉండేది. ఈమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని వేదికపై వినమ్రయంగా ప్రకటించాడు.
 
ఆ తర్వాత సుజాత రంగరాజన్ మాట్లాడుతూ, 'సిద్ధార్థ్ మొదటి నుంచి దర్శకుడు కావాలని కలలు కన్నాడు. 'బాయ్స్' సినిమాలో హీరో కోసం ఆడిషన్స్ జరుగుతుంటే నేను సిద్ధార్థ్‌ను తీసుకోవాల్సిందిగా దర్శకుడు శంకర్‌కు కోరాను. సిద్ధార్థ్ వెళ్లడానికి అంగీకరించలేదు. నేనే బలవంతంగా ఒప్పించి పంపా. శంకర్ ఫోన్ చేసి ఒకసారి వచ్చి ఫొటో షూట్ చేసి వెళ్లమనడంతో.. ఇష్టం లేకుండానే వెళ్లాడు. వాళ్లు తనని చూసిన వెంటనే ఆ సినిమాలో హీరోగా ఓకే చేశారు" అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా ఈ హీరోను ప్రశంసిస్తున్నారు. 'ఆమె చేసిన మేలు గుర్తుంచుకున్నావు. రియల్ హీరోవి' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.