1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Online prostitution racket busted in Hyderabad, assistant director arrested

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. నిర్వాహకులు అరెస్టు

prostitute
హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ వేదికగా చేసుకుని హెటెక్ వ్యభిచారం చేస్తూ వచ్చిన ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సురేశ్ బోయిన, అఖిల్ కుమార్‌లు ఉన్నారు. 
 
వీరిలో సురేశ్ కుమార్ గతంలో ప్రముఖ తెలుగు దర్శకుడి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో సురేశ్ గత కొంతకాలంగా గుట్టుచప్పుడుగా కొనసాగిస్తున్న ఈ చీకటి వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది.
 
అనేక మంది యువతులకు సినిమా అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. అలా, దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగాల్ వంటి వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను నగరానికి పిలిపించి, బలవంతంగా వ్యభిచారంలోకి దించేవాడు. 
 
ఈ క్రమంలో ధనవంతులైన విటులను ఆకర్షించేందుకు అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ హైటెక్ రీతిలో విటులను ఆకర్షించేవారు. పైగా, సురేశ్‌ హైదరాబాద్ నగరంలోనే కాకుండా, గోవా, బెంగుళూరుల్లో కూడా వ్యభిచార వ్యాపారాలు నిర్వహించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
తర్వాతి కథనం
వీరిలో జంతువులు ఎవరు.. మనుషులు ఎవరో చెప్పండి?