1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (16:35 IST)

నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న కె.రాఘవేంద్రరావు

Rajamouli- KRR
Rajamouli- KRR
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఇప్పుడు యూ ట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. కె.ఆర్‌.ఆర్‌. వర్క్స్‌ అనే యూ ట్యూబ్‌ ఛానల్‌ను శుక్రవారంనాడు దర్శకుడు రాజమౌళి ఆరంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, మన  రాఘవేంద్రరావుగారు ఎన్నో దశాబ్దాలుగా స్టార్స్‌ను ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇంకా ఆయన తపన ఆగలేదు. ఇంకా సరికొత్తగా న్యూ టాలెంట్‌ను పరిచయం చేయడానికి కె..ఆర్‌.ఆర్‌. వర్క్స్‌ను నా చేత ప్రారంభింపజేశారు. ఆల్‌ది బెస్ట్‌ కె.ఆర్‌.ఆర్‌. అని అన్నారు.
 
రెండు తెలుగు రాష్ట్రాలలో క్రియేటివ్‌ పీపుల్స్‌ను బయటపెట్టాలనే కె.ఆర్‌.ఆర్‌. వర్క్స్‌ ప్రారంభమైంది. సామాన్యుడిని సెలబ్రిటీని చేయడానికి సిద్దమయ్యారు. అందుకే సామాన్యులు తాము చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను, షాట్‌ స్టోరీస్‌ను వెబ్‌ సిరీస్‌ను, యాక్టింగ్‌ స్కిల్స్‌ను ఏవైనా వుంటే కె.ఆర్‌.ఆర్‌. స్టూడియోస్‌ 7799 అనే జీమెయిల్‌కు పంపండి అని కోరారు.