మంగళ, శుక్రవారాల్లో భైరవుడికి ఇలా మిరియాల దీపం వెలిగిస్తే...?
అత్యవసర అవసరాల కోసం సోమవారం రుణం తీసుకోవచ్చు. మంగళవారం రుణం తీర్చుకోవచ్చు. అప్పుల బాధ నుంచి విముక్తి కలగాలంటే రుణ విమోచనుడిగా పేరున్న భైరవుడిని పూజించవచ్చు. భైరవుడిని పూజిస్తే అప్పుల బాధ తీరుతుంది. 27 మిరియాలను చిన్న తెల్లటి గుడ్డలో వేసి కట్టలో కట్టాలి.
నిద్రపోయే ముందు మీ దిండు కింద ఉంచండి. ఆ తర్వాత ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి, ఈ మిరియాలు కట్టిన చిన్న సంచితో గుడికి వెళ్లాలి. అక్కడ భైరవుని ముందు ప్రమిదలో నెయ్యి పోసి ఈ మిరియాల కట్టను అందులో ముంచి దీపం వెలిగించాలి.
భైరవుడికి ఈ పరిహారం ప్రతి మంగళవారం లేదా శుక్రవారం చేయాలి. ఇలా ఈ మిరియాల దీపాన్ని తొమ్మిది వారాల పాటు పాటిస్తే మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధ త్వరలో తొలగిపోయి సంతోషంగా ఉంటారు. దీపం వెలిగించేటప్పుడు, రుణ పరిష్కారం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
రుణ సమస్యను పరిష్కరించడానికి మంగళవారం మంగళ హోరలో పరిహారం చేయవచ్చు. మంగళ హోర ఉదయం 6.00 నుండి 7.00 వరకు ఈ దీపం వెలిగించాలి. అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం 1.00 నుండి 2.00 వరకు.. ఇంకా మంగళవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఈ దీపం వెలిగించవచ్చు.
శ్రీ మహాలక్ష్మిని, కులదేవతను స్మరించుకొని ఇంటి పూజ గదిలో లేదా ఆలయలో ఈ దీపం వెలిగించండి. శుక్రవారం బెల్లం అలాగే రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం మంచిది.