గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (16:09 IST)

విశ్రాంతి తీసుకోండి గురూజీ.. అల్లు అర్జున్ ట్వీట్

Allu Arjun
Allu Arjun
దర్శకులు విశ్వనాథ్ మృతిపై హీరో రామ్ చరణ్ స్పందించారు. ఓ లెజెండ్‌ని కోల్పోయాము. మీకు మరణం లేదు. మా జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
 
సినిమా మేకింగ్‌లో మాస్టర్. నా ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఇకలేరు. మీరు దూరమైన మీరు తెరకెక్కించిన కళాఖండాలు మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయని... చెర్రీ తెలిపారు. 
Vishwanath
Vishwanath
 
మాస్టర్ ఆఫ్ ది క్రాఫ్ట్. అన్ని కాలాలలో నాకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. ప్రతి నటుడికీ గురువు. భారతీయ సినిమాకు గర్వకారణం విశ్వనాథ్ గారు ఇక లేరు. విశ్వనాథ్ గారు మాస్టర్ పీస్ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. విశ్రాంతి తీసుకోండి గురూజీ.. అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.  
K vishwanath
K vishwanath
 
సినిమాకు సంస్కృతిని పరిచయం చేసిన మేధావి. భారతదేశం గర్వించదగ్గ దర్శకులు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. అని మహేష్ ట్వీట్ చేశారు.