ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (10:33 IST)

శంకరాభరణం సినిమా నన్ను హత్తుకునిపోయింది : పవన్ కళ్యాణ్

viswanath
దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కళాతపస్వి తీసిన "శంకరాభరణం" చిత్రం తనను హత్తుకుపోయిందన్నారు. విశ్వనాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. 
 
నా చిన్నపుడు సంస్కృతి సంగీతం గురించి తెలియదన్నారు. కానీ, విశ్వనాథ్ చిత్రాలు చూశాక మన సంస్కృతి, కర్నాటక సంగీతం ఇంత గొప్పగా ఉంటుందా అని ఆశ్చర్యం వేసిందన్నారు. "శంకరాభరణం" చిత్రం పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిపిందన్నారు. ఆయన చిత్రాలు అన్ని వర్గాలను హత్తుకున్నాయన్నారు. 
 
సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు నిర్మించారని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. బాబు, బాలచంద్ర, విశ్వనాథ్ వంటి వారు చరిత్రకారులు అని ఆయన అన్నారు. విశ్వనాథ్.. యువతరానికి ఆదర్శంగా ఉంటారన్నారు. విశ్వనాథ్ కేవలం ఒక తెలుగు దర్శకుడు కాదే.. భారతీయ దర్శకుడు. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది అని మరో దర్శకుడు గుణేశేఖర్ అన్నారు. అన్ని తరాలకు శంకరాభరణం స్ఫూర్తినిస్తుంది అని ఆయన అన్నారు. ఆయన నిర్మించిన ప్రతి ఒక్క చిత్రం ఓ గొప్ప పుస్తకం అని  అన్నారు.